చెప్పిందే చేస్తాడు

6 Oct, 2020 01:06 IST|Sakshi
విక్కీ మాస్టర్

రాయలసీమ నేపథ్యంలో సినిమా అనగానే ఫ్యాక్షన్‌ ప్రధానాంశమని అనుకుంటారు. అయితే రాయలసీమలో అహింసను కోరుకునే శాంతి కాముకులు ఉన్నారనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘పులి బిడ్డ’. ‘చెప్పిందే చేస్తాడు’ అన్నది ఉపశీర్షిక. ‘పోలీస్‌ సిస్టర్స్, ఖాకీ చొక్కా, అశోక చక్రం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫైట్‌ మాస్టర్‌ విక్కీ ఈ సినిమాని డైరెక్ట్‌ చేయనున్నారు. రాజా ఫిలిమ్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. డైరెక్టర్‌ విక్కీ మాస్టర్, కథారచయిత యస్‌.ఎం. బాషా మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ యువ ముఖ్యమంత్రికి శత్రువులు అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. అయినప్పటికీ వారిపై కక్ష  తీర్చుకోకుండా వారిలో మార్పు తీసుకురావడానికి సీఎం ఎలాంటి ప్రయత్నం చేశాడన్నది కథాంశం. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్‌ను ఒంగోలులో ప్రారంభిస్తాం. ఇద్దరు ప్రముఖ సీనియర్‌ నటులతో పాటు పాత, కొత్త నటీనటులతో తెరకెక్కిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: భగవతి బాల, ఫైట్స్, దర్శకత్వం: విక్కీ మాస్టర్‌. 

మరిన్ని వార్తలు