Engagement: ప్రముఖ దర్శకుడి కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

5 Dec, 2022 19:42 IST|Sakshi

ప్రముఖ చిత్రనిర్మాత, బాలీవుడ్ దర్శకుడు విక్రమ్‌ భట్ కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విక్రమ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన కూతురు కృష్ణ భట్‌కు వేదాంత్‌ సర్దా అనే అబ్బాయితో నిశ్చితార్థం నిర్వహించారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.  

విక్రమ్ భట్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నేను చేతులపై మోసిన చిన్నారి నా కూతురేనా అంటూ 
ఎమోషనల్‌ అయ్యారు. ఆమె తలపై ఒక ముద్దు పెట్టి కుమార్తెపై ప్రేమను చాటుకున్నారు విక్రమ్ భట్. ఫోటోలు చూసిన  అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటులు సైతం జంటపై క్రేజీ కామెంట్స్ చేశారు. సుస్మితా సేన్, నటుడు రాహుల్ దేవ్, బిపాసా బసు, ఈషా గుప్తా ఇరువురి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేశారు.

A post shared by Vikram Bhatt (@vikrampbhatt)

మరిన్ని వార్తలు