సినిమా ఏంటో పోస్టరే చెబుతోంది: వీవీ వినాయక్‌

23 Dec, 2021 08:05 IST|Sakshi

‘‘పంచనామ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూడగానే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ కలుగుతోంది. ఈ సినిమాని ఎంత కసిగా చేశారో పోస్టరే చెబుతోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ లీడ్‌ రోల్స్‌లో సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా ‘పంచనామ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్‌ను వీవీ వినాయక్‌ విడుదల చేశారు. ‘‘మా సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది’’ అన్నారు సిగటాపు రమేష్‌ నాయుడు. 


వెంప కాశీ, వినాయక్‌ 

మరిన్ని వార్తలు