‘డర్టీ ఫెలో’ని ఆదరించండి

1 Dec, 2022 12:14 IST|Sakshi

డర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు

శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి డర్టీ ఫెలో అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌.  రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ బాగుంది . డర్టి ఫెలో టైటిల్  ఈ కథ కీ యాప్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

‘ఒక తండ్రి తన కొడుకుని సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా  పెరిగి, సమాజానికి హానికరంగా మారితే... ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి? అనేదే ఈ సినిమా కథాంశం అని హీరో శాంతి చంద్ర అన్నారు. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు ఆడారి మూర్తి అన్నారు. ‘మంచి కథ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వీరశంకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హీరోయిన్ శిమ్రితీ బతీజా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు