ఆటా పాటా

5 Oct, 2020 06:05 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాధే’. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సల్మాన్‌ కనిపిస్తారు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా హీరోయిన్‌ దిశా పటానీ కూడా సెట్లో అడుగుపెట్టారు. ఓ హుషారైన గీతాన్ని సల్మాన్, దిశా మీద చిత్రీకరిస్తున్నారు. ‘‘చాలా గ్యాప్‌ తర్వాత సెట్లో అడుగుపెట్టాను. ఓ సూపర్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు దిశా. 15 రోజుల్లోగా సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్‌ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్‌ వల్ల ఆగిపోయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుందని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు