Disha Patani : 'అంతా బాగానే ఉంటుంది'..  హీరోయిన్‌ పోస్టుకు అర్థమేంటి?

17 Aug, 2022 11:30 IST|Sakshi

బాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ దిశా పటానీ బ్రేకప్‌ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ జోడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కలిసి పార్టీలు, వెకేషన్లతో బీటౌన్‌లో మోస్ట్‌ పాపులర్‌ జోడీగా పేరు తెచ్చుకున్న టైగర్‌-దిశా పటానీ మధ్య ఏమైందో తెలియదు గానీ కొంతకాలంగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట.

దీంతో రీసెంట్‌గా  ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్‌ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్‌.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్‌. దీంతో అతడితో దిశా బ్రేకప్‌ చేసుకుందట.

ఇక టైగర్‌తో బ్రేకప్‌ రూమర్స్‌ మధ్య తాజాగా దిశా పటానీ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందంటే.. "మీకు తెలిసిన ప్రతిదానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి'' అంటూ దిశా ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ప్రియుడు టైగర్‌తో బ్రేకప్‌ నడుమ దిశా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మరిన్ని వార్తలు