దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!

13 Feb, 2021 11:57 IST|Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దిశా ఫ్యామిలీకి చెందిన ఓ న్యూస్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. దిశాకు సోదరి ఖుష్బూ, సోదరుడు సూర్యన్ష్‌ పటాని ఉన్నారు. సినిమా రంగంలో దూసుకుపోతున్న దిశాపటాని గురించి అందరికి తెలుసు కానీ ఆమె సోదరి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దిశా సోదరి ఖుష్బూ ఏ వృత్తిలో ఉందో తెలుసా.

ఆమె ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్‌నెస్‌ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్‌, వర్కౌట్‌ ఫోటోలను తరచుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఖుష్బూ వృత్తి తెలిసిన వారందరూ ఆశ్చర్యంగా ఫీల్‌ అవుతున్నారు. కదన రంగంలో సేవలందిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆర్మీ ట్రైనింగ్‌లో ఉన్న ఖుష్బూ ఫోటోలు, ఇద్దరు సోదరీమణులు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.

ఇక ఇద్దరు సోదరీమణులు విభిన్నరంగాలు ఎంచుకొని ఎవరి రంగంలో వారు విజయం సాధించడం గొప్ప విషయంగా ఫాన్స్‌ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. అక్షయ్ కుమార్ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇక హీరోయిన్లలో ప్రీతీ జింటా.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ లాంటి వారు ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు