‘ఆ విషయాన్ని రిపోర్టులో ప్రస్తావించలేదు’

5 Aug, 2020 20:58 IST|Sakshi

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో భాగంగా  అతడి మాజీ మేనేజర్ దిశ సలియన్ పోస్ట్‌మార్టం నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇందులో దిశ మృతికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టులో తన తలకు బలమైన గాయాలయ్యాయని, శరీరంపై అనేక చోట్ల సహజ గాయాలైనట్లు పోస్టుమార్టంలో వైద్యులు వెల్లడించారు. అవి 14 అంతస్తుపై నుంచి దూకడం వల్లే గాయలైనట్లు వైద్యులు రిపోర్టులో వెల్లడించారు. కానీ తన ప్రైవేటు భాగాలపై కూడా  గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో మాత్రం దీనిపై వైద్యులు ప్రస్తావించకపోవడం గమనార్హం. వివరాలు.. దిశ ముంబైలోని ఓ అపార్టుమెంటులో14వ అంతస్తులో నివసించేదని, ఈ క్రమంలో జూన్‌ 9న(సుశాంత్‌ ఆత్మహత్య నాలుగు రోజుల ముందు) రాత్రి 2 గంటల సమయంలో  తన అపార్టుమెంటు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్‌ మాజీ మేనేజర్‌ మృతి : దర్యాప్తు ముమ్మరం)

అయితే ఆ సమయంలో దిశ తన బాయ్‌ ఫ్రెండ్‌ రోహన్‌ రాయ్‌ ఇంట్లో ఉన్నట్లు  ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌ పేర్కొంది. మహరాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నారాయణ్‌ రాణే దిశ మరణంపై ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. దిశది ముమ్మాటికి అత్యాచారం, హత్యేనని ఆయన ఆరోపించారు. తన తలకు తీవ్రమైన గాయమైందని, ఇతర శరీర భాగాలపై సహజ గాయాలైనట్లు మాత్రమే వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో ధృవికరించారన్నారు. కానీ ఆమె ప్రైవేటు భాగాలపై కూడా గాయాలు ఉన్నాయని వాటిపై రిపోర్టులో వైద్యులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక దిశ జూన్‌ 9న ఆత్మహత్య చేసుకుని మరణిస్తే జూన్‌ 11న తన మృతదేహానికి పోస్టుమార్టం జరిపారని, రెండు రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్‌ కేసు: ప్రెస్‌ నోట్‌ విడుదల)

సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం తన మాజీ మేనేజరైన దిశ ఆత్మహత్యపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దిశ మరణించిన వారం వ్యవధిలోనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో వీరిద్దరి మృతి ముడిపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా సుశాంత్‌ కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశించడంతో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దిశ మృతిపై కూడా ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దిషా ఆత్మహత్యపై ఆధారాలు తెలిసిన వారు తమని సంప్రదించాలని పోలీసులు ప్రెస్‌ నోట్‌ కూడా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు