Ram Charan: డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్

18 Sep, 2021 19:46 IST|Sakshi

Ram Charan Disney Plus Hotstar Brand Ambassador Remuneration: ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీ సంస్థల హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీ సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులోకి రాబోతోంది. డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. 'మన వినోద విశ్వం' అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేయనున్నారు. ఇందుకోసం సదరు ఓటీటీ సంస్థ చరణ్‌కు భారీగానే ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సంవత్సరానికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సదరు వార్తల సారాంశం.  

హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్‌, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. గత ఏడాది తమిళంలో అడుగుపెట్టాం. సక్సెస్ సాధించాం. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం అని అన్నారు.

ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా నటించిన 'మాస్ట్రో', విజయ్ సేతుపతి, తాప్సీ కాంబోలో వచ్చిన 'అనబెల్లె సేతుపతి' అందుబాటులో ఉన్నాయి.  అంతే కాకుండా 'అన్ హర్డ్' వెబ్ సిరీస్ కూడా ప్రసారం అవుతోంది. ఇవే కాకుండా రీసెంట్‌గా ఘర్షణ, 9 అవర్స్, ఝాన్సీ వంటి సినిమాలతో పాటు నాగార్జున బిగ్ బాస్ షో కూడా అందుబాటులో ఉంది. వీవో ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు