డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది

25 Dec, 2021 00:24 IST|Sakshi
నవీన్‌ చంద్ర, మధు శాలిని, అంజలి, నాగార్జున, ఆకాంక్ష

– నాగార్జున

‘‘ప్రస్తుతం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాలీవుడ్‌లోనూ ఎన్నో ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌గా కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని నాగార్జున అన్నారు. ‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌’లో తెలుగు ఒరిజినల్‌ డ్రామా సిరీస్‌ ‘పరంపర’, నాగార్జున హోస్ట్‌ చేసిన ‘బిగ్‌ బాస్‌’ త్వర లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌’ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ సునీల్‌ రాయన్‌ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో ది బెస్ట్‌ కంటెంట్‌ ఇచ్చేందుకు ముందుంటాం. ‘‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌తో తెలుగు ఇండస్ట్రీ అసోసియేట్‌ అవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌’ అంబాసిడర్, హీరో రామ్‌చరణ్‌. ‘పరంపర, 9 అవర్స్, ఝాన్సీ, బిగ్‌ బాస్‌ లైవ్‌’ వంటి వాటిని దేశవ్యాప్తంగా చూపించబోతున్నాం’’ అన్నారు ‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌’ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ సునీల్‌ రాయన్‌.

మరిన్ని వార్తలు