అదరగొడుతున్న దివి ‘సిలక ముక్కుదానా’ సాంగ్‌

3 Jul, 2021 15:10 IST|Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్‌ హాట్‌ అందాల ఫొటోషూట్‌లను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా దివి ఓ ఫోక్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సాంగ్‌ ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్‌ వీడియో బయటకు వచ్చింది.

దివి లంగాఓణి, ఫుల్‌ జ్యూవెల్లరి, ముక్కపుడకతో పాటకు చిందేలిసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. విడుదలైన 2 గంటల్లోనే ఈ పాట 44 వేలకు పైగా వ్యూస్‌ రాబట్టి దూసుకుపోతోంది. ‘సిలక ముక్కుదానా.. అని ముద్దుగా పిలుస్తాడే’ అంటూ తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పాటకు దివి మాస్‌ స్టేప్పులతో ఇరగదీసింది. కాసర్ల శ్యాం లిరిక్స్‌ రాసిన ఈ పాటను గాయనీ హారిక నారాయణ్‌ ఆలపిచింది. శేఖర్‌ మాస్టర్‌ దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించాడు.  

మరిన్ని వార్తలు