ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌.. ఫోటోలు వైరల్!

20 Feb, 2024 21:18 IST|Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది.  తాజాగా మరో నటి దివ్య అగర్వాల్‌ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో నటి  ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్‌ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్‌లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. 

వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్‌టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ,  హల్దీ  వేడుక చేసుకున్నారు.  వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్‌ రాగిణి ఎంఎంఎస్‌ రిటర్న్స్‌-2 తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది.  ఏంటీవీ సీజన్‌- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్‌, ప్రియాంక్ శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉంది.

హల్దీ వేడుకపై ట్రోల్స్‌

దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్‌ కంటే బ్యాక్‌గ్రౌండ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్‌తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. 

A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official)

whatsapp channel

మరిన్ని వార్తలు