Divya Agarwal: మహిళలు లైంగిక విషయాల గూర్చి మాట్లాడితే ఎంకరేజ్‌ చేయరు

21 Sep, 2023 12:40 IST|Sakshi

హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2తో తన కెరీర్‌ ప్రారంభించిన బ్యూటీ దివ్య అగర్వాల్. పలు రియాలిటీ షోల్లో భామ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ -1 విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె కింక్‌(కిస్ ఇష్క్ ఎన్ కనెక్షన్స్) రియాలిటీ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాకుండా సమాజంలో భార్య, భర్తల మధ్య రిలేషన్‌పై మాట్లాడింది.  ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింక్‌ షో గురించి ప్రస్తావించింది.

(ఇది చదవండి: జవాన్‌ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!)

ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. 'నా ప్రయాణం అద్భుతంగా సాగింది. వాస్తవానికి, నేను యుక్తవయస్సులో అమాయకంగా ఉన్నా. కానీ నా ఒరిజినాలిటీయే నన్ను ముందు నడిపిస్తుందని నమ్ముతున్నా. నేనెప్పుడూ కూడా అలా మాట్లాడటానికి భయపడను. భార్య, భర్తల మధ్య రిలేషన్‌ గురించి ఒపెన్‌గానే ఉంటాను. కానీ నాకు బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు.' అని చెప్పుకొచ్చింది. 

భార్య, భర్తల మధ్య రిలేషన్‌పై మాట్లాడుతూ.. 'మన సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మహిళలు తమ లైంగిక కోరికలను బయటకు చెప్పడాన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే మన సమాజం ఇలాంటి వాటిపై మాట్లాడదు కూడా. ఈ అంశానికి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఒక స్త్రీ తనకు, భర్తకు మధ్య ఏదో మిస్సయిందని భావించినప్పుడు.. తప్పనిసరిగా సాయం కోరుతుంది. భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం, అనుకూలత మాత్రమే బంధానికి నిదర్శనం. మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా ఉండాలని కోరుకుంటే ఇలాంటి సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో తరచుగా తలెత్తే కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడానికి ఈ షో ద్వారా ప్రయత్నించడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ భాగస్వాములిద్దరూ తమ భావాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం.' అని అన్నారు.

(ఇది చదవండి: ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

మరిన్ని వార్తలు