ఆకట్టుకుంటున్న ‘చరిత కామాక్షి’ స్పెషల్‌ పోస్టర్‌

6 Sep, 2022 10:50 IST|Sakshi

నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చరిత కామాక్షి’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది.

చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు.

మరిన్ని వార్తలు