దీపావళి దగదగలు.. బాలీవుడ్‌ భామల మెరుపులు

24 Oct, 2022 11:02 IST|Sakshi

దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్‌ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్‌కుమార్‌రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్‌ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్‌ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్‌ ఖాన్‌ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు.

అలాగే నిర్మాత ఏక్తా కపూర్‌ దీపావళిని సెలబ్రేట్‌ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరై పాపులర్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్‌ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేశారు.

మరిన్ని వార్తలు