తాగుబోతులు అర్ధరాత్రి నా కారును వెంబడించారు: నటి

31 May, 2021 18:54 IST|Sakshi

'దియా ఔర్‌ బాతీ హమ్‌' నటి ప్రాచీ టెహ్లాన్‌ తనకు ఎదురైన ఓ భయంకర అనుభవాన్ని పంచుకుంది. ఓసారి తను రాత్రి కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు తాగుబోతులు తనను వెంబడించారని తెలిపింది. ఆ సమయంలో తన భర్త కూడా కారులో ఉన్నాడని, అయినప్పటికీ వాళ్లు తమను అనుసరించడం మానుకోలేదని, ఏకంగా మా ఏరియాలోకి వచ్చేశారని పేర్కొంది. అప్పుడు చాలా భయపడ్డానన్న ప్రాచీ ఆ సమయంలో వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పింది.

ఫ్యామిలీ పార్టీకి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది. తాగి తందానాలు ఆడుతూ, ఇతరులను ఇబ్బందులు పెట్టే వారిని వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇలా వికృత చేష్టలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తను పుట్టి పెరిగిన ఢిల్లీ అందమైన ప్రదేశమే, కానీ అంత సురక్షితమేమీ కాదని చెప్పుకొచ్చింది. ఢిల్లీలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ప్రాచీ అక్కడ సురక్షితంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. ఢిల్లీ కంటే ముంబై అంతో ఇంతో నయమేనని అభిప్రాయపడింది.

చదవండి: నో చెప్పినా ఆ డైరెక్టర్‌ ఇప్పటికీ వదలట్లేదు: హీరోయిన్‌

‘టాలీవుడ్‌లో మహేశ్‌ ఒక్కడే డబ్బులు వెనక్కి ఇస్తాడు’

మరిన్ని వార్తలు