Neha Shetty: డేజే టిల్లు హీరోయిన్‌పై ట్రోల్స్‌.. స్పందించిన నేహాశెట్టి

5 Mar, 2022 20:06 IST|Sakshi

డీజే టిల్లు సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకుంది హీరో​యిన్‌ నేహాశెట్టి. 2018లో మెహబూబా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత గల్లీరౌడీ,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది. కానీ డీజే టిల్లు చిత్రంలో మంచి విజయం అందుకుంది. క్యూట్‌ అండ్‌ గ్లామరస్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. అయితే  సినిమాకు ప్రశంసలు దక్కినా నేహాశెట్టిపై బాగానే ట్రోల్స్‌ వచ్చాయి.

తాజాగా వీటిపై ఆమె స్పందించింది. మనం ప్రతి ఒక్కిరికి నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతాం, మరికొంత మందికి అస్సలు నచ్చకపోవచ్చు. కానీ మెజార్టీ ఆడియెన్స్‌ రాధిక రోల్‌ను ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. 
 

మరిన్ని వార్తలు