‘డీజే టిల్లు’ పిల్లతో కిరణ్‌ అబ్బవరం రొమాన్స్‌!

15 Jun, 2022 16:45 IST|Sakshi

'యస్.ఆర్.కళ్యాణ్ మండపం'సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఇచ్చిన హిట్‌ కిక్‌తో వరుస ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వాటిలో ‘రూల్స్‌ రంజన్‌’మూవీ ఒకటి.రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్‌లోకి ‘డీజే టిల్లు’పిల్ల వచ్చి చేరింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘డీజే టిల్లు’ఫేమ్‌ నేహాశెట్టి నటిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.యస్.ఆర్.కళ్యాణ్ మండపం' తో కిరణ్ అబ్బవరం, 'డి.జె.టిల్లు' తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'రూల్స్ రంజన్' చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు