స్టైల్‌గా సైక్లింగ్ చేస్తున్న ఈ స్టార్‌ హీరోయిన్‌ని గుర్తుపట్టారా?

30 Sep, 2023 13:43 IST|Sakshi

అందమైన లొకేషన్స్‌లో స్టైల్‌గా స్లైక్లింగ్‌ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? సరే మీకోసం క్లూ ఇస్తాంలేండి. ఆమె ఓ పెద్ద స్టార్‌ హీరోయిన్‌. ఆ మధ్య ఓ అరుదైన వ్యాధిన పడి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటుంది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లింది. ఎస్‌.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె సమంతనే. మయోసైటిస్ వ్యాధిని నుంచి కోలుకున్న సమంత.. ప్రశాంతమైన లైఫ్‌ని గడపడానికై విదేశీ పర్యటకు వెళ్లింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకుంటుంది. అందులో భాగంగానే విదేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. 

ప్రస్తుతం సమంత ఆస్ట్రీయాలో ఉంది. అక్కడ అందమైన లోకేషన్స్‌ని సందర్శిస్తూ.. వాటిని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆస్ట్రియాలో సెల్జ్ బర్గ్ అనే నగరానికి వెళ్లిన సమంత.. అక్కడ ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా..అవికాస్త వైరల్‌ అయ్యాయి. కొన్నాళ్ల పాటు సామ్‌ విదేశాల్లోనే గడపనుంది. 

(చదవండి: ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే)

ఇక సినిమా విషయాలకొస్తే... విజయ్‌ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. రాజ్‌ అండ్‌ డీజే దర్శకత్వంలో సామ్‌ నటించిన ‘సీటాడెల్‌’ వెబ్‌ రిలీజ్‌కు రెడీ రెడీ అవుతోంది. ప్రముఖ ఓఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 2024 ఆరంభంలో విడుదల కానుంది. ఈ సిరీస్ తర్వాత సమంత బాలీవుడ్ లో తాజాగా సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు