ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్‌ పోస్ట్‌

5 Jun, 2021 15:35 IST|Sakshi

 మొబైల్‌ యాప్‌లో  సమస్య, వేరే  వ్యక్తి అకౌంట్‌లోకి లాగిన్‌

షాకైన రేణూ దేశాయ్‌,  అకౌంట్‌ రద్దుకు నిర్ణయం

తన అనుభవాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన రేణూ దేశాయ్‌

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్‌ వ్యవహారాలపై ఒక షాకింగ్‌ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీనికి సంబంధించిన  స్క్రీన్ షాట్‌ను కూడా  పోస్ట్‌ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా  తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. 

రేణూ దేశాయ్‌ పంచుకున్న విషయాల  ప్రకారం... ఆమె ఇండస్‌ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని  పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్‌ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్‌ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు.  కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్‌ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్‌ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి.

చదవండి:  Digital Rules: ట్విటర్‌కు ఫైనల్‌ వార్నింగ్‌

A post shared by renu (@renuudesai)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు