రియా పుట్టగానే విడాకులు.. ఈ మధ్యే వ్యాపారవేత్తతో రెండో పెళ్లి

11 Jul, 2021 08:00 IST|Sakshi

లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌ యాక్ట్రెస్‌ సుపర్ణ. మూడు పదుల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి  నటిగా మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం వరుస సిరీస్, సీరియల్స్‌తో బిజీగా ఉంటోంది. 


పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కోల్‌కత్తాలోనే. విద్యాభ్యాసం అనంతరం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ముంబైలో స్థిరపడింది. 

కూతురు రియా మొయిత్రా పుట్టిన కొన్ని సంవత్సరాలకే భార్యభర్తలిద్దరూ విడాకులు తీసుకునివిడిపోయారు. 

సింగిల్‌ పేరెంట్‌గా బిడ్డను పోషించుకోవడానికి మోడలింగ్‌వైపు అడుగులు వేసింది సుపర్ణ. నిజానికి తను కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేసేది. పెళ్లి తర్వాత మానేసింది. కూతురు కోసం తిరిగి మోడల్‌గా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగి పలు టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. 

ఆమె నటనాకౌశలానికి సినిమా అవకాశాలు క్లాప్‌ కొట్టాయి.  

2015లో ‘మీరఠియా గ్యాంగ్‌స్టర్స్‌’ తో వెండితెరకు పరిచయమైంది. తర్వాత ‘మామ్‌’, ‘మై బర్త్‌ డే సాంగ్‌’ సినిమాల్లోనూ నటించింది. 

2018లో ‘యే ప్యార్‌ నహీ తో క్యా హై’ సీరియల్‌తో ఇంటింటి అభిమాన తార అయింది. 

2019లో ‘బేకాబూ’తో వెబ్‌దునియాలోకీ ప్రవేశించింది. ప్రస్తుతం ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ప్రసారమవుతోన్న ‘నేకెడ్‌’తో వీక్షకులను 
అలరిస్తోంది. 

ఈ మధ్యనే వ్యాపారవేత్త రాహుల్‌ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈసారి కెరీర్‌ను ఆపలేదు. తనకిష్టమైన రంగంలో పనిచేస్తూ ఆనందంగా ఉంది. 

సంతోషంగా ఉన్నప్పుడు జీవితం చాలా చిన్నదిగాను, బాధగా ఉన్నప్పుడు పెద్దదిగానూ కనిపిస్తుంది. ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. విడాకులు తీసుకుని మంచిపనే చేశాను. లేకుంటే ఓ సాధారణ గృహిణిగా స్థిరపడిపోయేదాన్ని. 
– సుపర్ణ మొయిత్రా

మరిన్ని వార్తలు