‘ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌’ పలక్‌ సింగ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

4 Jul, 2021 07:30 IST|Sakshi

పలక్‌ సింగ్‌.. సిరీస్‌ కంటే ముందు సీరియల్స్‌తో పాపులర్‌. నృత్య కళాకారిణిగా పరిచయమై నటిగా మారింది. ఆ వివరాలు.. 

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ ఆమె పుట్టిన ఊరు. గుజరాత్‌లోని కనకేశ్వరీ దేవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలాక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ చదివింది. 

డాన్స్‌ మీదున్న మక్కువతో ముంబై చేరింది. 2013లో ‘డాన్స్‌ ఇండియా డాన్స్‌’ పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.  ఆమె అభినయాన్ని మెచ్చిన  ప్రేక్షకులు ‘ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌’ అనే కితాబునిచ్చారు.    

అభిమాన తారలు మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రాల స్ఫూర్తితో డాన్సర్‌ నుంచి యాక్టర్‌ కావాలనుకుంది. మొదట చిన్న చిన్న టీవీ షోలలో నటించింది. 

2016లో ‘మేరీ తాకత్‌’తో వెండితెర మీదా మెరిసింది. కొన్ని గుజరాతీ సినిమాల్లోనూ నటించింది. 

2017లో ఆమె నటించిన ‘పిజ్జా ఎమ్‌ఎమ్‌ఎస్‌’ సినిమా ‘వరల్డ్‌ విన్నింగ్‌ అవార్డ్స్‌’కు నామినేట్‌ అయింది. 

ఒకవైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ నటిస్తోంది. అలా ఆమె చేసిన సీరియల్సే ‘సిఐడి’, ‘క్రైమ్‌ పెట్రోల్‌’, ‘గందీ బాత్‌.’  

2018లో ‘ఇన్‌టర్న్‌ డైరీస్‌’తో వెబ్‌దునియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లోని  ‘క్రిమినల్‌ జస్టిస్‌’తో వీక్షకులను అలరిస్తోంది. 

గెలుపే జీవితం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. నిజానికి ప్రేక్షకులు నన్ను నటిగా అంగీకరించి, ఆదరించినపుడే నేను విజయం సాధించాను. సినిమాల్లోనే నటించాలనే నియమంతో రాలేదు. సినిమా,  సీరియల్,  సిరీస్‌ ఏదైనా నా  వందశాతం నేను ఇస్తా.
– పలక్‌ సింగ్‌.

మరిన్ని వార్తలు