‘శిఖండి’ సృష్టి శ్రీవాస్తవ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

12 Sep, 2021 18:42 IST|Sakshi

శిఖండి పేరు వినగానే.. మహాభారతంలోని ఓ అద్భుతమైన నారి గుర్తుకొస్తుంది కదూ!  ఆ మహా నారి వేషాన్ని ధరించడమే కాదు, అద్భుతంగా నటించి అవార్డు కూడా దక్కించుకుంది సృష్టి శ్రీవాస్తవ్‌. ప్రస్తుతం వరుస వెబ్‌సిరీస్‌లతో అలరిస్తోన్న ఆమె గురించి..  
  
► సృష్టి శ్రీవాస్తవ్‌ పుట్టింది లక్నోలోనైనా, పెరిగింది, చదివింది అంతా ముంబైలో. 

► మాస్‌మీడియా కోర్సు చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే, కొద్దిరోజులకే ఉద్యోగం వదిలి, హీరోయిన్‌ కావాలనుకుంది. 

►  అందరిలాగే తాను కూడా అవకాశాల కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఓ స్నేహితుడి సలహా మేరకు మొదట ఓ డ్రామా స్కూల్‌లో చేరింది. అక్కడ వివిధ స్టేజ్‌ షోలు చేస్తూ కొద్దికాలంలోనే మంచి థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. 

► ‘శిఖండి – ద స్టోరీ ఆఫ్‌ ది ఇన్‌ బిట్‌వీన్స్‌’ స్టేజ్‌ షోకు గాను ఆమెకు ‘ఎమ్‌ఈటీఏ (మహీంద్రా ఎక్సలెన్స్‌ ఇన్‌ థియేటర్‌ అవార్డ్స్‌)’ నుంచి బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌ పురస్కారం దక్కింది. 

► ‘రాజస్థాన్‌ టూరిజం’ యాడ్‌ షూట్‌కు సెలెక్ట్‌ అయింది. ఒకవైపు స్టేజ్‌ షోలు చేస్తూనే, వందకు పైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 

►  2017లో ‘పీఏ–గర్ల్స్‌’ అనే టీవీ సీరియల్లో,  ‘దిల్‌ జంగ్లీ’, ‘గులాబో సితాబో’ అనే సినిమాల్లో నటించింది. 

► నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం వెబ్‌సిరీస్‌ ‘గర్లియాపా’. ఈ సిరీస్‌ ప్రేక్షకాదరణపొంది, విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న ‘గర్ల్స్‌ హాస్టల్‌’ సిరీస్‌తో అలరిస్తోంది. 

చిన్నప్పుడు నేను డాన్స్‌ చేస్తుంటే, చాలా మంది నువ్వు మంచి హీరోయిన్‌ అవుతావ్‌ అనేవారు. నేనూ ఆ మాటను నమ్మేదాన్ని. కానీ, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలోనే హీరోయిన్‌ కంటే ముందు మంచి నటిని కావాలనుకున్నా. – సృష్టి శ్రీవాస్తవ్‌  

మరిన్ని వార్తలు