సమంత కేసు: థంబ్‌నైల్స్‌ మా బాధ్యత కాదు.. సీఎల్‌ వెంకట్‌రావు

27 Oct, 2021 21:39 IST|Sakshi

టాలీవుడ్‌ కపుల్‌ సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇష్టారీతిన థంబ్‌నైల్స్‌ పట్టి వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమంత పలు ఛానల్స్‌తో పాటు డాక్టర్‌ సీఎల్‌ వెంకట్‌రావుపై కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే! దీనిపై విచారణ చేపట్టిన కూకట్‌పల్లి కోర్టు సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా ఈ వ్యవహారంపై సీఎల్‌ వెంకట్‌రావు స్పందించారు. సాక్షి టీవీలోని డిబేట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కంటెంట్‌ ఇచ్చేది తామే అయినా ఈ థంబ్‌నైల్స్‌ ఇచ్చేవాళ్లు వేరే ఉంటారని పేర్కొన్నారు. హెడ్డింగ్స్‌ విషయంలో కంటెంట్‌ ప్రొవైడర్స్‌ అయిన తమకు ఎటువంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. ఈ హెడ్డింగ్స్‌ ఇచ్చేందుకు ఎస్‌ఈవో అనే టీమ్‌ ప్రత్యేకంగా పని చేస్తుందని, వారు థంబ్‌నైల్స్‌కు ఏ హెడ్డింగ్‌ ఇస్తున్నారో, ఎలాంటి ఫొటోలు వాడుతున్నారో కూడా తమకు చెప్పరని పేర్కొన్నారు. థంబ్‌నైల్స్‌ పెట్టేముందు వాటిని కనీసం తమకు చూపించరని చెప్పుకొచ్చారు. కాగా సీఎల్‌ వెంకట్‌రావు 'అబార్షన్‌, వ్యామోహమే విడాకులకు దారి తీసింది' అన్న థంబ్‌నైల్‌తో సమంత విడాకుల గురించి యూట్యూబ్‌లో వీడియో చేశారు.

మరిన్ని వార్తలు