డాక్టర్‌ స్ట్రేంజ్‌ మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

3 Jun, 2022 15:37 IST|Sakshi

Doctor Strange Multiverse of Madness: మార్వెల్‌ యూనివర్స్‌ తెరెక్కించే సూపర్‌ హీరో సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 2016లో వచ్చిన డాక్టర్‌ స్ట్రేంజ్‌ మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చింది డాక్టర్‌ స్ట్రేంజ్‌: ఇన్‌ ద మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌. ఈవిల్‌ డెడ్‌ డైరెక్టర్‌ సామ్‌ రైమీ రూ.1500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 6న విడుదలై వేల కోట్లు రాబట్టింది.

బెనడిక్ట్‌ కుంబర్‌ బ్యాచ్‌, ఎలిజబెత్‌ ఓల్సన్‌, జోచిటి గోమెజ్‌, వాండా మ్యాక్సిమాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అదరగొట్టింది. డాక్టర్‌ స్ట్రేంజ్‌ చూసినవారికి ఈ సీక్వెల్‌ బాగా అర్థమవుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌ జూన్‌ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్‌ ప్రకటించింది. మొత్తానికి మాస్టర్‌ పీస్‌ను తీసుకొస్తున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:Major Review: మేజర్‌ మూవీ రివ్యూ
బిగ్‌బాస్‌ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ !..

మరిన్ని వార్తలు