తల్లిదండ్రులకు అంకితం

18 Nov, 2021 05:15 IST|Sakshi
డాక్టరేట్‌ స్వీకరిస్తున్న బుర్రా సాయిమాధవ్‌

సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాకు చెందిన ‘న్యూలైఫ్‌ థియొలాజికల్‌ యూనివర్సిటీ’ వారు డాక్టరేట్‌ అందించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సాయిమాధవ్‌ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ‘ఈ పురస్కారాన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన్ను అభినందించారు.

మరిన్ని వార్తలు