Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ 30 ఏళ్ల సినీ జీవితంపై డాక్యుమెంటరీ

20 Sep, 2021 08:03 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. మూడు దశాబ్దాలు సుదీర్ఘంగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎ‍న్నో సూపర్‌హిట్స్‌ అందుకొని స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఈ తరుణంలో సల్లు భాయ్‌ సినీ ప్రయాణంపై డాక్యుమెంటరీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆయన కుంటుంబ సభ్యులు, సహా నటులు, దర్శకులు, నిర్మాతలను ఇంటర్వూ చేయనున్నారు. 

చదవండి: ఆ గేమ్‌ నన్ను వ్యంగ్యంగా చూపిస్తోంది: సల్మాన్‌ ఖాన్‌

ఈ డాక్యుమెంటరీని విజ్ ఫిల్మ్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సల్మాన్ ఖాన్‌ ప్రొడ్యూస్‌ చేయనున్నాడు. ఇది సల్లు భాయ్‌ సినీ ప్రయాణం, వివాదాలు, విఫల ప్రేమాయణాలపై ఉంటుందని తెలుస్తోంది. ఓటీటీలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్న ఈ డాక్యుమెంటరీకి సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ కలిసి కథ అందించనున్నట్లు సమాచారం.

కాగా, సల్మాన్‌ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న టైగర్‌ సిరీస్‌లో మూడో భాగం ‘టైగర్‌ 3’లోనూ, తన బావమరిదితో కలిసి ‘అంతిమ్‌’ మూవీలోనూ నటిస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్‌బాస్‌ 15 షోకి హోస్ట్‌ చేయనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు