అవకాశాల కోసం ఓ డైరెక్టర్‌ తనతో గడపాలన్నాడు: నటి

23 Dec, 2020 09:44 IST|Sakshi

సంచలన ఆరోపణలు చేసిన డోనాల్‌ బిష్ట్‌

‘దిల్‌ తో హ్యాపీ హై జీ’ ఫేమ్‌ నటి డోనాల్‌ బిష్ట్‌ బాలీవుడ్‌ స్మాల్‌ స్క్రీన్‌లో దూసుకుపోతున్నారు. వరుస అవకాశాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. జర్నలిస్ట్‌ అయిన డోనాల్‌ నటన మీద ప్రేమతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోనాల్‌ తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల గురించి వెల్లడించారు. అవకాశాల వేటలో ఉన్నప్పుడు ఓ సౌత్‌ డైరెక్టర్‌ తనతో చాలా నీచంగా మాట్లాడాడని.. అవకాశం ఇస్తానని అందుకు బదులుగా తనతో గడపాలని కోరాడని వెల్లడించారు. దాంతో అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈ సందర్భంగా డోనాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రారంభంలో నన్ను ఓ షో కోసం సెలక్ట్‌ చేశారు. డేట్స్‌ ఇచ్చాను. రెమ్యూనరేషన్‌ కూడా ఫైనల్‌ అయ్యింది. కానీ ఆకస్మాత్తుగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి నన్ను తొలగించారు. సదరు చానెల్‌ వేరే నటిని ఫైనలైజ్‌ చేశారు. ఈ సంఘటనతో ఇండస్ట్రీ, ముంబై జనాలు అంటేనే అబద్దం, నకిలీ అనే అభిప్రాయం నాతో పాటు మా కుటుంబ సభ్యులకు కూడా ఏర్పడింది. కానీ నటన మీద నాకున్న పిచ్చి తగ్గలేదు. ఆడిషన్లకు వెళ్లడం కూడా మానలేదు’ అన్నారు. (ఆ ‌నియమం పెట్టుకున్నా : హీరోయిన్‌ తాప్సీ)

‘ఇలా అవకాశాల వేటలో ఉండగా సౌత్‌లో ఇంతకన్నా భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఓ డైరెక్టర్‌ అవకాశం ఇస్తాను కానీ తనతో గడపాలని కోరాడు. వెంటనే నేను అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా కష్టాన్నే నమ్ముకున్నాను. ఇక ఇండస్ట్రీలోకి రావడానికి కాస్త ఎక్కువే శ్రమించాను. కానీ సరైన మార్గంలో ఇక్కడ ప్రవేశించాను’ అన్నారు. ఇక సౌత్‌ సంఘటనతో ముంబైకి మారానని.. ఆ తర్వాత తన ప్రతిభను గుర్తించిన దర్శకులు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారని.. ఇక వెనక్కి చూసుకోలేదని తెలిపారు డోనాల్‌.
 

మరిన్ని వార్తలు