మహిళలు నా పాత్రకు కనెక్ట్‌ అవుతారు : హీరోయిన్‌ ప్రీతి అస్రాని

20 Sep, 2022 13:05 IST|Sakshi

‘దొంగలున్నారు జాగ్రత్త’ యూనిక్‌ కథ. కథలో కీలకమైన నీరజ పాత్ర నాది. ప్రతి మహిళ నా పాత్రకు కనెక్ట్‌ అవుతారు’’ అని హీరోయిన్‌ ప్రీతి అస్రాని అన్నారు. శ్రీ సింహా కోడూరి, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సతీష్‌ త్రిపుర దర్శకత్వంలో డి. సురేష్‌ బాబు, సునీత తాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్‌ కానుంది.

ప్రీతి అస్రాని మాట్లాడుతూ– ‘‘మళ్ళీ రావా’ తర్వాత ‘ప్రెజర్‌ కుక్కర్, యాడ్‌ ఇన్ఫినిటమ్, సీటీమార్‌’ చిత్రాలు చేశాను.. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఛాలెంజ్‌తో కూడిన పాత్రలో నటించాను. సమంతగారి ‘యశోద’లో అతిథి పాత్ర చేశాను. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు