DOP Anji: ఆ చిత్రాలు డైరెక్టర్‌గా నాకు మంచి గుర్తింపు ఇచ్చాయి

6 Sep, 2022 21:16 IST|Sakshi

దాదాపు 50 చిత్రాలకు పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి సినీ పరిశ్రమలో డీఓపీ(DOP) అంజిగా ఫేమస్ అయ్యారు అంజి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూనే తనలోని మరో టాలెంట్‌ని బయటపెడుతూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 10th క్లాస్ డైరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటీ వేదికపై ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ ఇస్తున్న సూపర్ రెస్పాన్స్‌తో భారీ వ్యూస్ రాబడుతోంది. ఇదే జోష్‌లో బుజ్జి ఇలా రా అనే మరో సినిమాకు దర్శకత్వంలో వహించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచారు అంజి.

సునీల్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో బుజ్జి ఇలా రా సినిమాను తెరకెక్కింది. ఈ సినిమాను ఎస్‌ఎన్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రూప జగదీష్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.  జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో గరుడవేగా అంజి (DOP అంజి) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా నిర్వహించిన మూవీ సక్సెస్‌ మీట్‌లో  డైరెక్టర్ అంజి మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాని ఇంతలా ఆదరించిన తెలుగు ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు తెలిపారు.

‘ఈ చిత్ర కథ అనుకున్నప్పుడు ఆడియన్‌కి ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్‌తో ట్విస్టులతో ముందుకి వెళ్ళేలా రాసుకున్నాం. అలాంటి కథని తమ నటనతో ఇంకా బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నటించిన సునీల్, ధనరాజ్ లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. హీరోయిన్ గా నటించిన చాందిని తమిళ్ రసన్ తనదైన శైలిలో అద్బుతమైన నటనని కనబర్చింది. అలాగే శ్రీకాంత్ అయ్యింగార్, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి తదితర నటీనటులు వాళ్ళ వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేసి సినిమాని ఇంకో మెట్టు ఎక్కించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన సాయి కార్తీక్, ఎడిటర్ చోటా .కే .ప్రసాద్ గారు మెయిన్ అసెట్ అయ్యారు’ అని అంజి చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు