రెండో సినిమా మొదలుపెట్టిన దొరసాని డైరెక్టర్‌

4 Oct, 2022 09:49 IST|Sakshi

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ను దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు కెవిఆర్.మహేంద్ర, దొరసాని సినిమా విమర్శకుల ప్రశంశలు పొంది దర్శకుడికి మరియు నటీనటులకు మంచి పేరును తెచ్చిపెట్టింది. కెవిఆర్.మహేంద్ర తన రెండో సినిమాకు శ్రీకారం చుట్టారు, ఈ సినిమా ద్వారా కూడా నూతన నటీనటులను పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ప్రేమకథతో తనదైన శైలిలో దొరసాని సినిమాతో దర్శకుడిగా మారిన కెవిఆర్.మహేంద్ర ఈసారి ఒక క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాకు సంభందించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.

మరిన్ని వార్తలు