1997 Movie: వేరే దారి లేక అలాంటి రిస్క్‌ చేశా: డా. మోహన్‌

24 Nov, 2021 09:23 IST|Sakshi

‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథను చెప్పే ప్రయత్నమే ‘1997’ సినిమా. అంటరానితనం గురించి మా సినిమాలో ప్రశ్నిస్తున్నాం’’ అని నటుడు, దర్శక–నిర్మాత డా. మోహన్‌ అన్నారు. నవీన్‌ చంద్ర, డా. మోహన్, శ్రీకాంత్‌ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1997’. డా. మోహన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ– ‘‘1997లో జరిగిన సంఘటనలను మా తాతగారు నాకు చెప్పారు.. వాటి  స్ఫూర్తితో కథ రాసుకున్నాను. అత్యాచారానికి గురైన మహిళ పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించాం. మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్కే.. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా సంతృప్తి ఉంది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. 

మరిన్ని వార్తలు