Sekhar Movie Trailer : ఇంట్రెస్టింగ్‌గా రాజ'శేఖర్‌' ట్రైలర్‌

5 May, 2022 12:27 IST|Sakshi

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాజశేఖర్‌ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌, గ్లింప్స​ ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్‌ విడుదల చేశారు. మర్డర్‌ మిస్టరీని తన స్టైల్‌లో విచారణ జరపడం వంటివి ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్‌ హీరోయిన్‌గా నటించింది. 

మరిన్ని వార్తలు