ఆయనతో డ్యాన్స్‌ చేశా అంతే..

25 Sep, 2020 06:44 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులో మంగళూరు సీసీబీ నుంచి పిలుపు 

సాక్షి, కర్ణాటక: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో పేరుపొందిన కన్నడ టీవీ యాంకర్‌ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దీనిపై అనుశ్రీ స్పందిస్తూ 10 ఏళ్ల కిందట కిశోర్‌శెట్టి జతలో డ్యాన్స్‌ చేశాను అంతే, అతనితో నాకు అంత పరిచయం లేదు అని చెప్పారు. డ్రగ్స్‌ రవాణా కేసులో డ్యాన్సర్‌ కిశోర్‌శెట్టిని మంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం అనుశ్రీకి నోటీసులు పంపడంతో డ్రగ్స్‌ బాగోతం మరిన్ని మలుపులు తిరిగేలా ఉంది. మంగళూరుకు చెందిన అనుశ్రీ బెంగళూరులో స్థిరపడ్డారు. టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఇక కిశోర్‌శెట్టి బెంగళూరులో కార్తీక్‌శెట్టి అనే నిందితునితో కలిసి కాలేజీల వద్ద డ్రగ్స్‌ అమ్మేవాడని తేలింది. దీంతో కిశోర్‌శెట్టిని విచారణకు బెంగళూరుకు తీసుకురానున్నారు.
 
పెడ్లర్స్‌ ముఠా నేత కోసం గాలింపు  
బెంగళూరు నుండి గోవా, మంగళూరుకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠాను బెంగళూరు సీసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ముఠా నాయకుని కోసం అన్వేషిస్తున్నారు. ఇతనికి మాఫియా డాన్లతో సంబంధాలున్నట్లు తేలింది. ముఠా నాయకుని పేరును సీసీబీ బయట పెట్టడంలేదు.  (రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే)

ఐఎస్‌డీ నుండి సీసీబీ కేసు బదిలీ 
డ్రగ్స్‌ కేసును ఐఎస్‌డీ, సీసీబీ విభాగాలు విచారిస్తున్నాయి. రెండు సంస్థల దర్యాప్తు వల్ల గందరగోళం ఏర్పడవచ్చని భావించిన ఉన్నతాధికారులు మొత్తం దర్యాప్తును సీసీబీకే అప్పగించాలని నిర్ణయించారు. ఐఎస్‌డీ ఎడీజీపీ భాస్కర్‌రావ్,  డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ సమావేశమై చర్చించారు. 

మళ్లీ దిగంత్‌కు నోటీసులు?  
నటుడు దిగంత్‌ తన మొబైల్‌ఫోన్‌లోని సమాచారాన్ని నాశనం చేశారని సీసీబీ అనుమానిస్తోంది. వారంలో ఒకరోజు సమాచారాన్ని డిలిట్‌ చేస్తానని దిగంత్‌ విచారణలో చెప్పాడు. అతన్ని ఇప్పటివరకు రెండుసార్లు సీసీబీ ప్రశ్నించడం తెలిసిందే. కొందరు డ్రగ్స్‌ పెడ్లర్లతో సంబంధాలపై మరోసారి విచారణకు పిలిపించే అవకాశముంది. డ్రగ్స్‌ పారీ్టలు జరిపించారనే ఆరోపణలపై ఒక రిసార్ట్‌ యజమాని కార్తీక్‌ అలియాస్‌ రాజును సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలోనున్న శివప్రకాశ్, అదిత్య ఆళ్వ, షేక్‌ ఫాజల్‌ కోసం సీసీబీ గాలిస్తోంది.  (డ్రగ్స్‌ కేసు.. హీరోయిన్‌లకు షాక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా