Dulquer Salmaan: లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌

28 Jul, 2021 14:51 IST|Sakshi

దుల్క‌ర్ స‌ల్మాన్‌ హీరోగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నేడు (జూలై 28) దుల్కర్‌ బర్త్‌డే సందర్భంగా ఆయనను లెఫ్టినెంట్‌ రామ్‌గా పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో మంచు కొండల్లోనూ తన విధులు నిర్వర్తిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు హీరో. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇదే తన బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అని దుల్కర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు