‘‘సీతారామం’ కోసం వందల మంది రెండేళ్లు కష్టపడ్డాం’

26 Jun, 2022 08:33 IST|Sakshi
∙స్వప్నా దత్‌ , దుల్కర్, హను, విశాల్‌

‘‘సీతారామం’ కథ గొప్పగా ఉంటుంది. నటుడిగా నేను ఎంత స్కోర్‌ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్‌ చేస్తే నేను హ్యాపీ. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా’’ అన్నారు దుల్కర్‌ సల్మాన్‌. లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్‌ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’.  హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వీనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

(చదవండి: ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్‌ సీన్‌ ఈజీ అయింది)

ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘సీతారామం’ ఒక మ్యాజికల్‌ లవ్‌స్టోరీ. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడానికి వందల మంది రెండేళ్లుగా కష్టపడ్డాం. వైవిధ్యమైన ప్రదేశాల్లో మైనస్‌ 24 డిగ్రీల్లో కూడా షూట్‌ చేశాం’’ అన్నారు.  ‘‘ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌.

‘‘మా బేనర్‌లో ‘మహానటి’లో కాస్త నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న జెమినీ గణేశన్‌గారి పాత్రని దుల్కర్‌ బాగా చేశారు. తనకు మా మీద నమ్మకం ఎక్కువ. అందుకే దుల్కర్‌కి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటాం. ఈ కథకి దుల్కర్‌ వెంటనే ఓకే చెప్పారు’’ అన్నారు స్వప్నాదత్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రష్మికా మందన్న, సుమంత్, గౌతమ్‌ మీనన్, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్‌ వినోద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: 

మరిన్ని వార్తలు