నేను బ్యాడ్‌ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్‌ సల్మాన్‌ 

12 Nov, 2021 08:13 IST|Sakshi

Dulquer Salman Starer Kurup Movie:  ‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. ఇక్కడ రానా, అఖిల్‌.. ఇలా కొందరు స్నేహితులున్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు వస్తుందని చెప్పలేను. ‘కురుప్‌’ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌.. అందుకే తెలుగులోనూ విడుదల చేస్తున్నాం’’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కురుప్‌’. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించి, నిర్మించారు. శోభిత ధూలిపాళ్ల కథానాయిక. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దుల్కర్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీనాథ్‌ రాజేంద్రన్, నా జర్నీ ఒకేసారి మొదలైంది. నా తొలి సినిమా (‘సెకండ్‌ షో’) ఆయనతోనే చేశాను. అప్పుడే ‘కురుప్‌’ చేయాలనుకున్నాం. ఇది సుకుమార కురుప్‌ అనే కిల్లర్‌ జీవితంతో తీసిన సినిమా. ఇందులో మేం అతడిని హీరోలా చూపించలేదు. నేను కురుప్‌గా బ్యాడ్‌ బాయ్‌ పాత్రలో కనిపిస్తాను. కురుప్‌ వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయో చూపించాం. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ కాబట్టి  భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు