Sita Ramam: మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే?

8 Aug, 2022 17:22 IST|Sakshi

చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసిన అందమైన ప్రేమకావ్యం సీతారామం.. సినిమా చూశాక ప్రేక్షకులు సంతోషంతో చెప్తున్న మాటిది.. హీరోహీరోయిన్ల నటన, సాంగ్స్‌, ప్రతి సీనూ అద్భుతంగా ఉండటంతో సీతారామం సినిమాకు పాజిటివ్‌ స్పందనే కాదు అంతకుమించిన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో రిలీజైంది.

విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.60 కోట్ల గ్రాస్‌, రూ.3.05 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ వసూళ్లు కొంత పెరగడంతో రూ.7.25 కోట్ల గ్రాస్‌ రాగా రూ.3.63 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. మొత్తానికి సీతా, రామ్‌ల మ్యాజిక్‌ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది.

చదవండి: థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
శ్రీదేవి సినిమాలను రీమేక్‌ చేస్తారా? జాన్వీ ఆన్సరిదే

మరిన్ని వార్తలు