‘దుల్కర్ సల్మాన్‌’ పాన్‌ ఇండియా మూవీ.. విడుదల ఎప్పుడంటే..

24 Oct, 2021 16:31 IST|Sakshi

‘ఒకే బంగారం’ మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయమైన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. కీర్తీ సురేశ్‌ ‘మహానటి’లో లీడ్‌రోడ్‌లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అనంతరం వచ్చిన డబ్బింగ్‌ మూవీతో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా తన క్రేజ్‌ని మరింత పెంచుకున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కురుప్‌’.

ఈ సినిమాని నవంబర్‌ 12 విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు దుల్కర్‌. ‘చివరి ఈ మూవీని రిలీజ్‌ చేయడానికి సి​ద్ధంగా ఉ‍న్నాం. ప్రతి సినిమాకి ఓ డెస్టినీ ఉంటుంది. అది ఎప్పుడూ విడుదల కావాలో అప్పుడే అవుతుందని నాకు తెలుసు. త్వరలో థియేటర్స్‌లోకి రాబోతున్నాం’ అంటూ తెలియజేశాడు ఈ కుర్రహీరో.

అయితే మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అదే పేరుతో విడుదల కానుంది ఈ మూవీ.  శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించాడు. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కథానాయికగా నటించింది. కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ముప్పుతిప్పలు పెట్టిన భయంకరమైన క్రిమినల్ ‘సుకుమార కురుప్పు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అతను 1984లో కేరళలో  ఇన్సూరెన్స్ డబ్బులకోసం ఓ అమాయకుడిని కారులో వేసి తగలబెట్టి తనే చనిపోయినట్లు నమ్మించాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

చదవండి: లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌

మరిన్ని వార్తలు