Dulquer Salmaan: ‘నటుడిగా పనికి రాననంటూ నాపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేశారు’

14 Sep, 2022 15:15 IST|Sakshi

హీరో దుల్కర్‌ సల్మాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ తనదైన నటన, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ హీరోలలో ఒక్కడిగా మారాడు. ఒకే బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించిన దుల్కర్‌ ‘మహానటి’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇక రీసెంట్‌గా విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో రామ్‌గా ప్రేక్షకు హృదయాలను కొల్లకొట్టాడు. ఇందులో దుల్కర్‌ లెఫ్టినెంట్‌ రామ్‌ అనే ఆర్మీ యువకుడిగా కనిపించాడు.

చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

ఈ సినిమాతో తెలుగులో మరో కమర్షియల్‌ హిట్‌ అందుకున్నద దుల్కర్‌ త్వరలో ‘చుప్‌: రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌’ మూవీతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆర్‌ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్‌ నెగిటివ్ రివ్యూస్‌, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా కనిపించనున్నాడు.  ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంగ్లీష్‌ చానల్‌తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ సందర్భంగా మొదట్లో తనపై కూడా చాలా నెగిటివ్‌ రివ్యూస్‌, విమర్శలు వచ్చాయని, అవి చదివి చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘‘కెరీర్‌ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని. అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవారు. ‘నాకు యాక్టింగ్‌ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కూడా కొరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్‌గా పనికి రాననన్నారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని  కోరుకుంటున్నాం’ అంటూ అంటూ నాపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేశారు. అది నన్ను చాలా బాధించింది’’ అంటూ దుల్కర్‌ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.  

మరిన్ని వార్తలు