అడుగు బయటపెట్టేది లేదు!

7 Aug, 2020 01:07 IST|Sakshi
మమ్ముట్టి

మమ్ముట్టికి సవాళ్లంటే ఇష్టమట. తాజాగా ఓ సవాల్‌ ను తన మీద తానే విసురుకున్నారు. లాక్‌ డౌన్‌ మొదలైనప్పటి నుంచి మమ్ముట్టి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదట. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి సుమారు 150 రోజులు అయింది. ఇలా బయటకు రాకుండా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండగలనో చూస్తాను అని ఓ చిన్న ఛాలెంజ్‌ చేసుకున్నారట. ‘సరదాగా ఓ డ్రైవ్‌ కి వెళ్లి రండి’ అని ఇంట్లోవాళ్లు అన్నప్పటికీ ‘నో’ అనేశారట మమ్ముట్టి. ఇలా తండ్రి బయటకు అడుగుపెట్టేది లేదని, ఇంటిపట్టునే ఉంటున్న విషయాన్ని మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్‌ సల్మాన్‌ సరదాగా షేర్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు