లక్కీ భాస్కర్‌ షురూ

25 Sep, 2023 03:57 IST|Sakshi

‘మహానటి, సీతారామం’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్‌ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్‌’ రూపొందుతోంది. ‘సార్‌’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్‌ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్‌ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు