Eagle Eye Entertainment: ‘ఊరికి ఉత్త‌రాన‌’ ఊపు.. త్వరలోనే మరో చిత్రం

11 Dec, 2021 18:54 IST|Sakshi

న‌రేన్  వ‌న‌ప‌ర్తి హీరోగా ప‌రిచ‌యం అవుతూ ఈగిల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్ నిర్మించిన  `ఊరికి ఉత్త‌రాన‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం-2గా మ‌రో చిత్రాన్ని రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి కావొచ్చింది.

ఈ సంద‌ర్భంగా హీరో , చిత్ర స‌మ‌ర్ప‌కులు న‌రేన్ వ‌న‌ప‌ర్తి మాట్లాడుతూ... ‘ఊరికి ఉత్త‌రాన‌’ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. కొత్తవారైనా కంటెంట్ ఉంటే సినిమాను ఆద‌రిస్తార‌ని మా చిత్రం మ‌రోసారి నిరూపించింది. `ఊరికి ఉత్త‌రాన‌` స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా మ‌రో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ప్ర‌క‌టిస్తాం’ అన్నారు.

మరిన్ని వార్తలు