ఈగల్‌కు ఓటీటీ డేట్‌ దొరికినట్లేనా.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా..?

23 Feb, 2024 13:40 IST|Sakshi

రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది.

సినిమా విడుదల సమయంలో ఈగల్‌కు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో.. ఇప్పుడు ఓటీటీ విడుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురు అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలు వచ్చాక సినిమాకు కొంత అదనపు బిజినెస్‌ ఉంటుంది. కానీ పలు కారణాల వల్ల ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రావు. ఉదాహారణకు 'ది కేరళ స్టోరీ' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా విడుదలయైన పది నెలలకు ఓటీటీలో విడుదల అయింది. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 9న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ భాగస్వామితో డీల్‌ కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్‌లో ఈగల్‌ సందడి దాదాపు ముగిసిందని చెప్పవచ్చు. సినిమాపై మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా..  తర్వాత ఫర్వాలేదు అనే టాక్‌ రావడంతో మళ్లీ కలెక్షన్స్‌ పెరిగాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కూడా ఓటీటీ డీల్‌ సెట్‌ కాలేదు అనేది రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. 

ఈగల్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈగల్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డీల్‌ ప్రకారం ఏప్రిల్‌ మొదటి వారంలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అయితే అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు