Tollywood Drug Case : ఉచ్చు బిగుస్తోంది..ఫెమా కేసులూ కూడా.

29 Aug, 2021 11:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో న్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన ఈడీ తాజాగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధారంగా ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్‌ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్‌పోల్‌ సహయంతో విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది.  హవాలా మార్గంలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు  గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్‌ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది.

వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

చదవండి : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
Tollywood Drugs Case 2021: డ్రగ్స్‌ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి

మరిన్ని వార్తలు