Editor Goutham Raju: గౌతమ్‌ రాజుని కోల్పోవడం దురదృష్టకరం : చిరంజీవి

6 Jul, 2022 11:17 IST|Sakshi

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు(68) మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలియజేశాడు. ‘ గౌతమ్‌ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్‌ అలంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌ రాజు గారు లేకపోవటం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

(చదవండి: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్‌ కన్నుమూత)

కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్‌ రాజు మంగళవారం అర్థరాత్రి హైదాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్‌, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. 

మరిన్ని వార్తలు