షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ‘సూర్యాపేట జంక్షన్‌’

23 Sep, 2022 12:02 IST|Sakshi

సూర్యాపేట జంక్షన్‌లో... ఈశ్వర్, నైనా సర్వర్‌ జంటగా ‘కథనం’ ఫేమ్‌ నాదెండ్ల రాజేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యాపేట జంక్షన్‌’. అనిల్‌ కుమార్‌ కాత్రగడ్డ , ఎన్‌.ఎస్‌. రావు, విష్ణువర్ధన్‌ నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ‘‘కొత్తగా మా ప్రయాణం’ తర్వాత నేను చేసిన రెండో చిత్రం ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. నేనే కథ రాసుకున్నాను.

నాదెళ్ల రాజేష్‌కి నచ్చడంతో, ఇద్దరం కలసి ఫుల్‌ స్టోరీ డెవలప్‌ చేశాం’’ అన్నారు ఈశ్వర్‌. ‘‘ఇది మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, గౌర హరి, కెమెరా: అరుణ్‌ ప్రసాద్‌.
 

మరిన్ని వార్తలు