వైరల్‌ విశాలాక్షి కొత్తగా అనిపించింది

1 Oct, 2023 05:17 IST|Sakshi

– ఈషా రెబ్బా

సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్‌ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్‌బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్‌ విశాలాక్షి పాత్ర చేశాను.

ఏదో ఒకటి చేసి వైరల్‌ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్‌గారు చెప్పినప్పుడు కన్‌ఫ్యూజ్‌ అయ్యాను. కానీ సెట్స్‌లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ ప్రభుతో ఓ సినిమా కమిట్‌ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్‌ సిరీస్‌ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు