Ek Mini Katha: వారం రోజుల్లో స్ట్రీమింగ్‌ కానున్న ఏక్‌ మినీ కథ

21 May, 2021 08:01 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లకు తాళం పడింది. దీంతో బోలెడన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. ఫలితంగా ప్రజలు మరోసారి ఓటీటీకి జై కొడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్న సినిమా కూడా ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయింది. 

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన 'ఏక్‌ మినీ కథ'ను ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు రూ.9 కోట్లు ముట్టచెప్పినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌.. 'ఏక్‌ మినీ కథ' రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. మే 27 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. కార్తీక్‌ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని యూవీ సంస్థ నిర్మించింది. కావ్య తాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సప్తగిరి, శ్రద్ధా దాస్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, పోసాని కృష్ణమురళీ, కేశవ్‌ దీపక్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ అడల్ట్‌ టచ్‌ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి!

చదవండి: డబ్బున్నోడిదే ప్రాణమా? అన్న నెటిజన్‌.. ఏకిపారేసిన రేణు

ఓటీటీలో విడుదల కానున్న మరో టాలీవుడ్‌ మూవీ!

మరిన్ని వార్తలు