Emilia Clarke Brain Disease: ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్‌, 2 సార్లు చావు అంచుల వరకు..

21 Jul, 2022 21:13 IST|Sakshi

ప్రముఖ పాపులర్‌ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యాక్షన్‌, అడ్వెంచర్‌ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ మొత్తం 73 ఎపిసోడ్స్‌, 8 సీజన్లుగా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఇక ఈ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎమీలియా క్లార్క్. దీని అనంతరం వచ్చిన స్టార్‌వార్స్ సినిమాలతో ఈ నటి మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్రిటిష్‌ బ్యూటీ నటించిన చిత్రం ‘ది సీగల్’. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. 

చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్న నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకున్న ప్రాణాంతక వ్యాధి గురించి బయటపెట్టింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, దీనివల్ల రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా నేను బ్రెయిన్‌ అనూరిజం అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. బ్రెయిన్‌ అనూరిజం వల్ల మెదడుకి సరిగ రక్తం సరఫరా కాదు. దానివల్ల ఓ ప్రదేశంలో బ్లడ్‌ క్లాట్‌ అయ్యి పెలిపోయే ప్రమాదం ఉంది. నాలో ఈ వ్యాధి బయటపడగానే సర్జరీ చేయించుకున్నాను. తొలిసారి 2011లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2013లో మళ్లీ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది.

చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్‌ వీడియో వైరల్‌

అప్పుడు కొన్ని అత్యవసర చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సర్జరీల వల్ల తన మెదడులోని సగ భాగం పనిచేయదని చెప్పంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇకపై నేను నా మెదడుని పూర్తిగా ఉపయోగించలేను. కానీ.. స్పష్టంగా మాట్లాడగలగడం నా అదృష్టం. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఆ కొద్ది మందిలో నేను ఉడడం అదృష్టంగా భావిస్తోన్న. మీ మెదడులోని ఏ భాగానికైన రక్తం అందకపోతే అది పనికిరాకుండా పోతుంది. ప్రవహించే దారిలో ఏదైనా అడ్డువస్తే రక్తం వెంటనే వేరే దారి చూసుకుంటుంది. దానివల్ల రక్తం అందని భాగం పనిచేయదు’ అని వివరిచింది.

మరిన్ని వార్తలు